![సీఎంగా చంద్రబాబు... డిప్యూటీగా పవన్ కల్యాణ్ జూన్ 12న ప్రమాణం](https://static.v6velugu.com/uploads/2024/06/june-12thoath-on--andhra-pradesh-cm-chandrabababu-and-dy-cm-pavan-kalayan_56wnkO4u9K.jpg)
-
మంత్రులుగా 25 మంది
-
గవర్నర్ కు కూటమి నేతల లేఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణం స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు గవర్నర్ కు కూటమి నేతలు లేఖ అందించారు. మంత్రులుగా25 మంది ప్రమాణం చేస్తారు. టీడీపీకి 19, జనసేనకు మూడు, బీజేపీకి రెండు మంత్రి పదవులు లభిస్తాయని సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని తెలుస్తోంది.